Pawan Kalyan: టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పవన్ భేటీ..నేడు, రేపటి షెడ్యూల్ ఇదే

  • ప్రాధాన్యం సంతరించుకున్న ఎమ్మెల్యే, పవన్ భేటీ
  • గంటన్నరపాటు చర్చ
  • నేడు కదిరిలో, రేపు ధర్మవరంలో పర్యటన

టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ  కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం తొలి రోజు పర్యటనను ముగించుకున్న పవన్ రాత్రికి ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు.  దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో పలు విషయాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం  ఓ ప్రైవేటు లాడ్జికి చేరుకున్న పవన్ అక్కడే బస చేశారు.

నేడు పవన్ కదిరిలో పర్యటించనున్నారు. అలాగే కరువు పరిస్థితులపై స్థానికులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పుట్టపర్తి హనుమాన్ జంక్షన్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం సత్యసాయి మందిరాన్ని దర్శించుకుంటారు. 29న ధర్మవరం చేరుకుని చేనేత  కార్మికులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటారు.  మధ్యాహ్నం 2 గంటలకు హిందూపురంలో జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.

Pawan Kalyan
Jana Sena
Telugudesam
MLA
Anantapur
  • Loading...

More Telugu News