harbhajan singh: మీ గడ్డ నన్ను సింహంలా తయారు చేస్తుంది!: హర్భజన్ సింగ్

  • భజ్జీని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
  • సంతోషం వ్యక్తం చేసిన భజ్జీ
  • తమిళంలో ట్వీట్

టీమిండియా స్టార్ స్పిన్నర్, ఒంటి చేత్తో భారత్ కు ఎన్నో విజయాలను అందించిన హర్భజన్ సింగ్ ను ఐపీఎల్ వేలం పాటలో చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ. 2 కోట్లకే భజ్జీ అమ్ముడుపోయాడు. ఈ నేపథ్యంలో, ట్విట్టర్ ద్వారా భజ్జీ స్పందించాడు.

'మీ తరపున ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ గడ్డ నన్ను సింహంలా తయారు చేస్తుంది' అంటూ తమిళంలో ట్వీట్ చేశాడు. తమిళ పాటలోని ఓ చరణాన్ని ఉపయోగిస్తూ ధన్యవాదాలు తెలిపాడు. భజ్జీతో పాటు ధోనీ, కేదార్ జాదవ్, డుప్లెసిస్, డ్వేన్ బ్రేవో, షేన్ వాట్సన్ తదితర ఆటగాళ్లు చెన్నై జట్టులో ఉన్నారు. ఐపీఎల్ మొదటి పది సీజన్లకు ముంబై ఇండియన్స్ కు హర్భజన్ ప్రాతినిధ్యం వహించాడు.

harbhajan singh
chennai super kings
ipl
  • Loading...

More Telugu News