Jagan: నిజమే.. జగన్ ను చూసి ఎవరూ రారు: బుద్దా వెంకన్న

  • జగన్ చెప్పింది నిజమే
  • ఆయనను చూసి పారిశ్రామికవేత్తలు ఎవరూ రారు
  • చంద్రబాబును చూసి చాలా మంది వస్తున్నారు

ప్రత్యేక హోదావల్లే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని, ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తారని వైసీపీ అధినేత జగన్ అన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబునో, లేదా తననో చూసి ఎవరూ రాష్ట్రానికి రారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. జగన్ కు నాయకత్వ లక్షణాలు లేవనే విషయం మరోసారి నిరూపితమైందని ఆయన ఎద్దేవా చేశారు.

చంద్రబాబును, నన్ను చూసి పరిశ్రమలు రావని జగన్ అంటున్నారని... ఆయన చెప్పింది నిజమేనని, జగన్ ను చూసి రాష్ట్రానికి ఎవరూ రారని అన్నారు. చంద్రబాబును చూసి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెప్పారు. అబద్ధాలు చెప్పడాన్ని ఇకనైనా జగన్ మానుకోవాలని హితవు పలికారు.

Jagan
Chandrababu
budda venkanna
Special Category Status
  • Loading...

More Telugu News