jio: జియో 4జీ ఫీచర్ ఫోన్‌ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌!

  • రిపబ్లిక్‌ డే సందర్భంగా రూ.49 ప్లాన్‌ ఆవిష్కరణ
  • 1జీబీ 4జీ డేటాతో పాటు 28 రోజుల వాలిడిటీ
  • అఫిషియల్ సైట్లో వెల్లడి

జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియోఫోన్ ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రకాల షరతులతో ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. కాగా రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలయన్స్‌ జియో తన 4జీ ఫీచర్‌ ఫోన్‌ యూజర్ల కోసం రూ.49 ప్లాన్‌ను ఆవిష్కరించింది. దీనిలో ఉచిత వాయిస్‌ కాల్స్‌, 1జీబీ 4జీ డేటాతో పాటు 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. అలాగే వీరి కోసం రూ.11, రూ.21, రూ.51, రూ.101 ధరల్లో డేటా యాడ్‌–ఆన్‌ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్లను జియో అఫిషియల్ సైట్లో పొందుపరిచింది.

jio
jiophone
4g
offer
technology
  • Loading...

More Telugu News