Pawan Kalyan: స్టేజిపైకి వెళ్లి, పవన్ ను గుండెలకు హత్తుకున్న అభిమాని.. షాకైన పోలీసులు!

  • అనంతపురంలో ఘటన
  • పోలీసులను దాటుకుని పవన్ వద్దకు చేరుకున్న అభిమాని
  • అభిమానితో సెల్ఫీ దిగిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా పర్యటనలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అనంతపురంలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేసిన తర్వాత, ఆయన భారీ బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ ను కలవడం కోసం ఓ అభిమాని చేసిన ప్రయత్నంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. డయాస్ వద్దకు తోసుకు వస్తున్న అభిమానులను కట్టడి చేస్తున్న పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని వేదికపైకి వచ్చాడు. వెంటనే పవన్ ను గట్టిగా హత్తుకున్నాడు. పవన్ కూడా అతన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు.

అయితే, అక్కడున్న పోలీసులు, నేతలు మాత్రం షాక్ కు గురయ్యారు. అతన్ని పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. సదరు అభిమాని మాత్రం పవన్ ను వదలకుండా గట్టిగా పట్టుకునే ఉన్నాడు. చివరకు పవన్ తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపడంతో... అతని ఫోన్ ను పవన్ తీసుకుని స్వయంగా సెల్ఫీని తీశారు. అనంతరం సదరు అభిమాని ఎంతో సంతోషంగా వెళ్లిపోయాడు. పవన్ తో కలవడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.

Pawan Kalyan
pawan kalyan fan
janasena
  • Error fetching data: Network response was not ok

More Telugu News