Nara Lokesh: దావోస్ నుంచి అమెరికా బయల్దేరిన నారా లోకేష్

  • ముగిసిన లోకేష్ దావోస్ పర్యటన
  • 9 రోజుల పాటు అమెరికాలో పర్యటన
  • పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులతో భేటీలు

ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన ముగిసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా బిజీగా గడిపిన ఆయన అక్కడ నుంచి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. మొత్తం 9 రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షోను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల అధిపతులు, సీఈవోలతో ఆయన వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా సియాటెల్, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, బోస్టన్ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News