nationa highway: జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌మాదాల‌కు ప్ర‌త్యేక టోల్ ఫ్రీ నెంబ‌ర్‌

  • 1033 నెంబ‌ర్‌తో హెల్ప్‌లైన్‌
  • బాధితుల‌కు త్వ‌రిత సాయం
  • ఫిబ్ర‌వరి చివ‌రి వారం నుంచి అందుబాటులోకి

అతివేగం, మ‌ద్యం తాగి డ్రైవ్ చేయ‌డం, నిద్ర‌మ‌త్తులో న‌డ‌ప‌డం వంటి ప‌లు కారణాల వల్ల జాతీయ ర‌హ‌దారుల‌పై ఘోర రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డిన వారికి స‌రైన స‌మ‌యానికి చికిత్స జ‌ర‌గ‌క‌పోవ‌డంతో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఓ కొత్త స‌దుపాయాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇందుకోసం ఓ ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ‘1033’ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి బాధితుల‌కు స‌రైన స‌మ‌యానికి చికిత్స అందించే స‌దుపాయం క‌ల‌గ‌నుంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

హైవేలపై ప్రమాదానికి గురయ్యే బాధితులకు త్వరిత సాయం అందించేందుకు, వారిని త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామ‌ని, త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్న‌ట్లు ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌ దీపక్‌ కుమార్ తెలిపారు. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ గురించి అందరికీ తెలియజేసేలా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కేవ‌లం ప్ర‌మాదాల గురించే కాకుండా రోడ్ల నిర్వ‌హ‌ణ‌, అసౌక‌ర్యం గురించి కూడా ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చ‌ని ఆయ‌న వివ‌రించారు.

  • Loading...

More Telugu News