ntr: ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ 
  • త్వరలో సెట్స్ పైకి
  • ఖరారు కావలసివున్న కథానాయిక  

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'అజ్ఞాతవాసి'  సినిమాకి సంగీతాన్ని అందించిన అనిరుధ్, ఈ సినిమాకి కూడా సంగీతాన్ని సమకూర్చనున్నాడు.

మరోపక్క, ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ఎన్టీఆర్ గట్టి కసరత్తునే చేస్తున్నాడట. ఈ సినిమా కథానేపథ్యం ఏమిటనే ఆసక్తి ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది. దాదాపు యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉండవచ్చని అంతా భావించారు. కానీ .. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వుండనుందనేది తాజా సమాచారం. కుటుంబం .. బంధాలు .. అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటించడమే కాకుండా, కథానాయిక ఎవరనే విషయంలోనూ స్పష్టతను ఇవ్వనున్నారు.  

  • Loading...

More Telugu News