china: కుర్రాడిని పెళ్లి చేసుకోవ‌డానికి కోటి రూపాయ‌ల క‌ట్నం ఇచ్చిన 38 ఏళ్ల మ‌హిళ‌... వీడియో!

  • పెళ్లి కుమారుడి త‌ల్లిదండ్రులను ఒప్పించ‌డానికి డ‌బ్బు ఎర‌
  • అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన పెళ్లి
  • వైర‌ల్ అవుతున్న చైనా మ‌హిళ పెళ్లి వీడియో

తక్కువ వ‌య‌సున్న కుర్రాడిని పెళ్లి చేసుకోవాల‌నే ఉద్దేశంతో చైనాకు చెందిన 38 ఏళ్ల మ‌హిళ అబ్బాయి త‌ల్లిదండ్రుల‌కు డ‌బ్బు ఆశ చూపించింది. మొద‌ట వారు ఒప్పుకోక‌పోయినా.. రూ. కోటి క‌ట్నం అనేస‌రికి త‌లూపారు. ఆ మ‌హిళ కంటే అబ్బాయి 15 ఏళ్లు చిన్న‌వాడు. ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే... ఆ మ‌హిళ‌కు ఇప్ప‌టికే 14 ఏళ్ల వ‌య‌సున్న కుమారుడు కూడా ఉన్నాడు.

అంద‌రూ ఒప్పుకోవ‌డంతో వారి పెళ్లి జ‌న‌వ‌రి 10న క్వాంగాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒంటి నిండా బంగారు న‌గ‌లు ధ‌రించి, రెడ్ స్పోర్ట్స్ కారులో పెళ్లి జంట కూర్చుని ఉండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా పెళ్లి కూతురు ఆనందంతో అభివాదం చేస్తుండ‌టం కూడా ఈ వీడియోలో ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News