fake currency: రూ. 50 ఫేక్ నోట్ల చలామణి.. దొంగ నోట్లను ఇలా గుర్తించవచ్చు!

  • యథేచ్చగా రూ. 50 దొంగనోట్ల చలామణి
  • గుర్తు పట్టలేనంత ఒరిజినల్ గా ఫేక్ నోట్లు
  • జాగ్రత్తగా పరిశీలిస్తే దొంగనోట్లను గుర్తించవచ్చు

ఇప్పటి వరకు పెద్ద నోట్లకే పరిమితమైన దొంగ నోట్ల దందా... చిన్న నోట్లకు కూడా పాకింది. రూ. 50 నోట్ల ఫేక్ కరెన్సీ యథేచ్చగా చలామణి అవుతోంది. రూ. 2 వేలు, రూ. 500 నోట్ల మీద నిఘా ఎక్కువగా ఉండటం, కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు కూడా వీటిని పట్టేస్తుండటంతో... అక్రమార్కులు రూ. 50 నోట్లపై దృష్టి సారించారు. పెట్రోలు బంకులు, మెడికల్ షాపులు, బట్టల షాపులు, వైన్స్, కిరాణా షాపులు, కిళ్లీ బడ్డీలు... ఇలా అనుకూలంగా ఉన్న ప్రతిచోటా రూ. 50 దొంగ నోట్లు చేతులు మారుతున్నాయి. తాజాగా చేబ్రోలులోని ఓ షాపు యజమాని ఈ దొంగ నోటును గుర్తించి, నోటును తీసుకోకపోవడంతో విషయం వెలుగు చూసింది. నకిలీ నోటు అచ్చం ఒరిజినల్ నోటుగానే ఉండటంతో అధికారులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది.

ఈ దొంగ నోట్లను ఇలా గుర్తించవచ్చు.
  • అసలు నోటు పైభాగంలో చుక్కలు ఉంటాయి. దొంగ నోటుపై చుక్కలు లేవు. 
  • గాంధీ బొమ్మ వైపు ఆర్బీఐ పేరుతో వెండి గీత ఉంటుంది. దీనిపై అది కనిపించడం లేదు. 
  • అసలు నోటుకు పక్కన చుక్కలు, పద్మంలాగా ఉంటుంది. 
  • దొంగ నోటుకు పువ్వు గుర్తు మాత్రమే ఉండి, చుక్కలు లేకుండా ఉన్నాయి. 
  • కిందవైపు నోటును ముద్రించిన సంవత్సరం ఉంటుంది. దొంగ నోటుపై సంవత్సరం లేదు.

  • Loading...

More Telugu News