hemamalini: చెవి బాధ నుంచి రాందేవ్ బాబా నన్ను కాపాడారు!: హేమమాలిని

  • విమాన ప్రయాణంలో నా రెండు చెవులు మూసుకుపోయాయి
  • డాక్టర్లను సంప్రదిస్తే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు
  • రాందేవ్ బాబా ఆవాల నూనెతో సమస్యను పరిష్కరించారు

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తనను చెవి బాధ నుంచి కాపాడారని ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తెలిపారు. ముంబైలో ఆమె మాట్లాడుతూ, తాను విమాన ప్రయాణం చేసినపుడు చలికాలం కారణంగా తన రెండు చెవులు పూర్తిగా మూసుకుపోయాయని, వైద్యులను సంప్రదిస్తే ఉపశమనం కోసం శస్త్రచికిత్స చేయించుకోమని సలహా ఇచ్చారని అన్నారు.

అప్పుడు తాను యోగా గురు రాందేవ్ ను కలవగా, సర్సోంకా తేల్ (ఆవాల నూనె) ను ముక్కుతో పీల్చాలని ఆయన సూచించారని, తాను అలా చేయగానే తన సమస్య పరిష్కారమైందని, ప్రస్తుతం తన చెవులు బాగా పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. రాందేవ్ బాబా చికిత్స ప్రకృతికి దగ్గరగా, సహజంగా ఉంటుందని ఆమె కితాబునిచ్చారు. 

hemamalini
ramdev baba
natural treatment
  • Loading...

More Telugu News