Donald Trump: ట్రంప్ తో నాకు అఫైర్ లేదు... విజయవంతమైన మహిళపై వదంతులు అసహ్యకరం!: నిక్కీ హేలీ

  • ట్రంప్, హేలీ మధ్య అఫైర్ ఉందంటూ ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ అనే పుస్తకంలో పేర్కొన్న రచయిత ‌
  • ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఏకాంతంగా గడుపుతారు
  • రచయిత మైఖేల్‌ వుల్ఫ్‌ ఆరోపణలను ఖండించిన హేలీ

అమెరికా అధ్యక్షుడి ప్రయాణాల కోసం నిర్దేశించిన 'ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌' విమానంలో అధ్యక్షుడు ట్రంప్, ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయాబారి నిక్కీ హేలీ (46) కలసి ఏకాంతంగా చాలాసేపు గడుపుతున్నారని ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ అనే పుస్తకంలో రచయిత మైఖేల్‌ వుల్ఫ్‌ పేర్కొన్నారు. దీంతో నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య అఫైర్ ఉందంటూ వదంతులు చుట్టుముట్టాయి.

ఈ నేపథ్యంలో నిక్కీ హేలీ తీవ్రంగా స్పందించారు. విజయవంతమైన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని పేర్కొన్నారు. తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్‌ తో తన భవిష్యత్‌ గురించి చర్చించలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపలేదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ‘ఉపాధి’ పనులపై 76 శాతం మంది అమెరికన్లు సంతృప్తిగా ఉన్నారని ఆమె తెలిపారు.

Donald Trump
america
nikki haley
  • Loading...

More Telugu News