Vijayawada: రాజ్యాంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తుండటం దురదృష్టకరం: ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

  • ఏపీ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
  • అసెంబ్లీలు, పార్లమెంట్ లను బలహీనపరుస్తున్న ప్రభుత్వాలు
  • లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నాయి: రఘువీరారెడ్డి

రాజ్యాంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తుండటం దురదృష్టకరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ కోసం ‘మేము సైతం సిద్ధం’ అంటూ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, విద్యార్థులు మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.

 ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనునిత్యం రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, ఈ ధోరణిని తాము ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యాంగం ద్వారా నిర్మితమైన అసెంబ్లీలను, పార్లమెంట్ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనపరుస్తున్నాయని, లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. అంబేద్కర్, మహాత్మాగాంధీ చెప్పినట్టు రాజ్యాంగం ద్వారా ఈ లౌకిక వాదాన్ని రక్షించుకోవడానికి తాము ముందు వరుసలో ఉంటామని అన్నారు.  

  • Loading...

More Telugu News