Congress: ‘రెడ్డి’ కులస్తులకు సీఎం పదవి ఇస్తే అభ్యంతరం లేదు కానీ, బీసీలకు పెద్దపీట వేయాలి: దానం నాగేందర్

  • ‘కాంగ్రెస్’లో బీసీలకు ప్రాధాన్యమివ్వకపోతే పార్టీకే నష్టం
  • ఆ నష్టం జరగకుండా పార్టీ చూసుకోవాలి
  • నాకు పార్టీ మారే ఉద్దేశం లేదు: దానం నాగేందర్

తెలంగాణలో ‘రెడ్డి’ కులస్తులకు సీఎం పదవి ఇస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ, బీసీలకు మాత్రం పెద్దపీట వేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యమివ్వాలని, వారికి సముచితమైన పదవులు ఇవ్వకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. ఆ నష్టం జరగకుండా పార్టీ చూసుకోవాలని ఆయన సూచించారు.

 పార్టీలోని బలహీనవర్గాలకు చెందిన నాయకులను గుర్తించాలని, వారికి మంచి పదవులు ఇవ్వాలనే విషయాన్ని ఇటీవల రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించానని అన్నారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, ఒకవేళ పార్టీ మారాలని తాను అనుకుంటే గతంలోనే మారే వాడినని అన్నారు. టీఆర్ఎస్ లో చేరేందుకు తాను ఫ్లెక్సీలు వేయించి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాననేది అబద్ధపు ప్రచారమని దానం నాగేందర్ కొట్టిపారేశారు.

Congress
danam nagender
  • Loading...

More Telugu News