sp balasubramanyam: ఇళయారాజాను చేరిన ‘పద్మవిభూషణ్’ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

  • ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన వారందరికీ నా అభినందనలు
  • గణతంత్ర దినోత్సవాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం
  • ఫేస్ బుక్ పోస్ట్ లో సంతోషం వ్యక్తం చేసిన ఎస్పీ బాలు

ప్రముఖసంగీత దర్శకుడు, గాయకుడు ఇళయరాజాకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తూ ఇళయరాజాకు అభినందనలు తెలిపారు. తాజాగా, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు.

‘గౌరవప్రదమైన గణతంత్ర దినోత్సవాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం. జై భారత్. ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన వారందరికీ నా అభినందనలు. శ్రీ ఇళయరాజాను చేరిన ‘పద్మవిభూషణ్’కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది..’ అంటూ తన సంతోషాన్ని, ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరోమారు చాటుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News