Asaduddin Owaisi: జాతీయ జెండాను ఎగరేసిన అసదుద్దీన్ ఒవైసీ!

  • తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 69వ గణతంత్ర వేడుకలు
  • పలు పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాల ఆవిష్కరణ
  • హైదరాబాద్‌లోని మదీనా వద్ద గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 69వ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరా స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహిస్తుండగా, హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. రాజకీయ పార్టీల నాయకులు తమ తమ కార్యాలయాల వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తున్నారు. కాగా, ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్థానిక నేతలు, ప్రజలతో కలిసి నగరంలోని మదీనా సర్కిల్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ముస్లింలతో కలిసి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

Asaduddin Owaisi
Hyderabad
Republic Day
  • Error fetching data: Network response was not ok

More Telugu News