Bank Manager: భార్య పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి పైశాచికం... అరెస్ట్ చేస్తారన్న భయంతో బ్యాంకు స్ట్రాంగ్ రూములో దాగి నాటకం!

  • నిందితుడు బ్యాంకు మేనేజర్
  • తప్పు అతనిదేనని తేల్చిన పోలీసులు
  • భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య
  • విడాకులకు దరఖాస్తు

వేరే ఊరిలో ఉద్యోగం చేస్తున్న భార్య నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టించడంతో పాటు "నాతో స్నేహం చేయండి. రాత్రి పూట మీతో మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది" అని పోస్టులు పెడుతూ, ఆమె ఫోన్ నంబర్ ఇచ్చి వేధిస్తున్న పైశాచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు హైడ్రామానే నడిచింది. హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీకాకుళంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ శాంతి సృజన్‌ కు ఇటీవలే హైదరాబాద్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పని చేస్తున్న యువతితో వివాహం జరిగింది. ఆమెకు శ్రీకాకుళానికి బదిలీ కాకపోవడంతో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ లోనే ఉంది.

ఈ క్రమంలో ఆమె పేరిట తప్పుడు ఫేస్ బుక్ ఖాతా సృష్టించగా, బాధితురాలికి అసభ్య సందేశాలు, అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. తన భర్తే దీనికి కారకుడన్న అనుమానంతో అతన్ని నిలదీసిన ఆమె, సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీ అడ్రస్ ల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఇదంతా సృజన్ నిర్వాకమేనని తేల్చారు.

దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు శ్రీకాకుళం వెళ్లిన పోలీసులను ముందుగానే గమనించి బ్యాంకు స్ట్రాంగ్ రూములో దాక్కున్నాడు సృజన్. ప్రశ్నించేందుకు వచ్చామని పోలీసులు చెప్పడంతో నాటకమాడాడు. తనకు గుండెనొప్పి వస్తోందని చెప్పాడు. ఇక అక్కడే తాముంటే అతను బయటకు రాడన్న భావనతో తాము వెళ్లిపోతున్నామని చెప్పి, అక్కడే మకాం వేశారు పోలీసులు. ఆపై మరో గంట తరువాత అతన్ని బయటకు రాగా, వెంటనే అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తెచ్చి కటకటాల వెనక్కు పంపారు. అప్పటికే భర్త ప్రవర్తనపై విరక్తితో ఉన్న ఆమె, విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.

Bank Manager
Srujan
Srikakulam District
Hyderabad
Cyber Crime
Facebook
  • Loading...

More Telugu News