suicide: పళని ఆలయంలో ముగ్గురి ఆత్మహత్య!

  • త‌మిళ‌నాడులో ఘటన
  • సోదరీమణులతో కలిసి వేలుసామి అనే వ్యక్తి బలవన్మరణం
  • అప్పుల బాధ తట్టుకోలేకపోవడమే కారణం

ఓ వ్యక్తి తన సోదరీమణులతో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటన త‌మిళ‌నాడులోని పళని అడివారం అరుల్‌జ్యోతి వీధిలో క‌ల‌క‌లం రేపింది. దివ్యాంగుడయిన వేలుసామి (32) చిల్లర దుకాణం నడుపుతూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. వేలుసామికి నలుగురు సోదరీమణులున్నారు. అందులో జయలక్ష్మి అనే సోద‌రికి ఇప్ప‌టికే వివాహం కాగా, ఆమె భర్తతో విడిపోయి వేలుస్వామి వ‌ద్దే ఉంటోంది. కాగా, వేలుసామి ఇంటి నిర్మాణానికి కొందరి వద్ద అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో ఆయ‌నపై కొన్ని రోజులుగా ఒత్తిడి పెరిగిపోయింది.

తీసుకున్న అప్పు చెల్లించలేక వేలుసామి త‌న‌ సోదరీమణులు చంద్ర, జయలక్ష్మితో పాటు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుని పళని మురుగన్ ఆలయానికి వ‌చ్చాడు. వారు ముగ్గురు అక్క‌డే విషం తీసుకోవ‌డంతో నురగలు కక్కుతూ స్పృహతప్పి పడిపోయారు. ఈ విష‌యాన్ని గుర్తించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు స‌మాచారం అందించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
 

suicide
Tamilnadu
palani
  • Loading...

More Telugu News