Mahesh Babu: 'ఇదిగో మరో లడ్డూ' అంటూ అఫీషియల్ టైటిల్ ను కూడా రిలీజ్ చేసిన కొరటాల శివ!

  • చిత్రానికి అందరూ అనుకుంటున్న టైటిలే
  • 'భరత్ అనే నేను' పేరిట తొలి పోస్టర్ విడుదల
  • స్టయిల్ గా కనిపిస్తున్న మహేష్ బాబు

ఈ ఉదయం 'భరత్ అనే నేను' ఫస్ట్ ఓత్ ను విడుదల చేసి ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులను ఖుషీ చేసిన చిత్ర టీమ్, ఆపై "ఒక లడ్డూ చాలదా? మరో లడ్డూ ఇదిగో" అంటూ ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ను టైటిల్ తో సహా విడుదల చేశారు కొరటాల శివ.

వెనుకవైపు మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రాలుండగా, చేతిలో బ్యాగ్ పట్టుకుని స్టయిల్ గా తన కార్యాలయంలోకి వస్తున్న మహేష్ బాబు పోస్టర్ ను 'భరత్ అనే నేను' అన్న టైటిల్ తో ఆయన పంచుకున్నారు. ఈ చిత్రానికి ముందు నుంచి అదే టైటిల్ అనుకుంటుండగా, ఇప్పుడు అధికారికంగా కూడా అదే కన్ఫార్మ్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

Mahesh Babu
Bharath Ane Nenu
First poster
  • Loading...

More Telugu News