Komatireddy Venkata Reddy: కన్నీరు కారుస్తూనే పాడె మోసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

  • హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్
  • ఏడుస్తూనే అంత్యక్రియల్లో పాల్గొన్న కోమటిరెడ్డి
  • హత్య వెనుక రాజకీయ కోణం
  • విచారిస్తున్నామన్న పోలీసులు

నిన్న ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హతుడైన తన కుడిభుజం, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నీరు కారుస్తూనే పాడె మోశారు. ఆయన హత్య చేయబడ్డారని తెలుసుకున్న తరువాత హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చిన ఆయన, అంత్యక్రియలు ముగిసేవరకూ శ్రీనివాస్ ఇంటి వద్దనే ఉన్నారు. ఒక్కరోజు ముందు తనతో ఉన్న వ్యక్తి, తాను హైదరాబాద్ వెళ్లేసరికి దూరం కావడం తనను కలచి వేస్తోందని ఏడుస్తున్న ఆయన్ను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

ఈ సందర్భంగా ఆయన కొంతసేపు సొమ్మసిల్లి పడిపోగా, పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతలు సపర్యలు చేశారు. కాగా, శ్రీనివాస్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సైతం దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తన అనుచరుల మధ్య వాగ్వాదం జరుగుతోందని తెలుసుకున్న ఆయన, దాన్ని ఆపేందుకు వెళ్లి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Komatireddy Venkata Reddy
Boddupalli Srinivas
Nalgonda District
Murder
  • Loading...

More Telugu News