Rashi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'తొలిప్రేమ'పై రాశిఖన్నా ఆశలు 
  • నితిన్ సినిమా పూర్తయింది 
  • జోరుగా 'భారతీయుడు' సీక్వెల్ పనులు 
  • త్వరలో డబ్బింగ్ చెప్పేస్తానంటున్న బాలీవుడ్ భామ  

*  ఇంతవరకు గ్లామరస్ పాత్రల్లోనే కనిపించిన అందాలనాయిక రాశిఖన్నా తాజాగా నటించిన 'తొలిప్రేమ' సినిమాలో అభినయానికి ఆస్కారం వున్న పాత్రలో నటించిందట. హీరో వరుణ్ తో పోటీపడుతూ పెర్ఫార్మ్ చేసిందని, అందుకే, ఈ చిత్రం తనకు ఆర్టిస్టుగా పేరు తెస్తుందని ఆశలు పెట్టుకుందని చెబుతున్నారు.
*  నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. బ్యాలెన్స్ గా వున్న ఒక పాటను త్వరలో చిత్రీకరిస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను సమకూర్చిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ నాయికగా నటిస్తోంది.  
*  కమలహాసన్ కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో రూపొందే 'భారతీయుడు' చిత్రం సీక్వెల్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత జయామోహన్ ఈ చిత్రం స్క్రిప్ట్ విషయంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  త్వరలోనే తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తానంటోంది బాలీవుడ్ భామ అమైరా దస్తర్. తాజాగా ఈ చిన్నది తెలుగులో 'మనసుకు నచ్చింది', 'రాజుగాడు' చిత్రాలలో నటించింది. ఈ సినిమాల సమయంలో తెలుగు రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డానని, త్వరలోనే భాష నేర్చుకుని, డబ్బింగ్ కూడా చెబుతానని అమైరా చెప్పింది.     

  • Loading...

More Telugu News