rss: సామాజిక మార్పుతోనే కుల రాజకీయాలకు ముగింపు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

  • కుల రాజకీయాలు పోవాలంటే సామాజిక మార్పు జరగాలి
  • వ్యాపారం నుంచి రాజకీయాల వరకు ‘కులం’ ప్రభావం 
  • సమాజం ఆలోచనా విధానంలో వచ్చే మార్పే రాజకీయాల్లో మార్పుకు దారితీస్తుంది: మోహన్ భగవత్

సామాజిక మార్పు వస్తే గానీ కులరాజకీయాలకు ముగింపు పలకలేమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వ్యాపారం నుంచి రాజకీయాల వరకు ‘కులం’ ప్రభావం కనబడుతూ ఉంటుందని, ఈ విషయంలో మార్పు సంభవించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నేషనలిజమ్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ ఇన్ బిజినెస్’ అనే అంశంపై ముంబైలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటువంటి విషయాలపై రాజకీయనాయకులు ఒక దశ వరకే పోరాడగలుగుతారని, వ్యక్తిగత ఆసక్తులను పక్కనపెట్టడం ద్వారా ముందుకు వెళ్లగలుగుతామని, మెరుగైన ఫలితాలను సాధించగలుగుతామని అన్నారు. సామాజిక మార్పు కనుక సంభవిస్తే కనుక కులాల పేరిట రాజకీయాలు చేయమని బహిరంగంగా రాజకీయనాయకులు ప్రకటిస్తారని అన్నారు. సమాజం ఆలోచనా విధానంలో వచ్చే మార్పే రాజకీయాల్లో మార్పుకు దారితీస్తుందని అన్నారు. ఉఫాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా మన దేశంలో వ్యాపారం ఉండాలని, మనం అందించే సేవలు ఉత్తమంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. 

rss
bhagath
  • Loading...

More Telugu News