vijaya shanthi: టీఆర్ఎస్ ట్రిక్స్ నాకు తెలుసు.. గట్టిగా స్పందిస్తా: విజయశాంతి

  • మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా
  • నేను రాజకీయాల్లోకి వచ్చి రేపటితో 20 ఏళ్లు పూర్తి
  • తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేశారు

తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను రాజకీయాల్లోకి వచ్చి రేపటితో 20 ఏళ్లు పూర్తవుతుందని చెప్పారు. ఏదైనా ఓ ప్రాంతం నుంచి తనను పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబుతున్నారని ఆమె తెలిపారు.

తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేశారని విజయశాంతి విమర్శించారు. టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ను ప్రశ్నించనివ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణలో పవన్ కల్యాణే కాదని, ఎవరయినా పర్యటించవచ్చని, ఎవ్వరినీ ప్రభుత్వం అడ్డుకోకూడదని అన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరని ఆమె అన్నారు. టీఆర్ఎస్ ట్రిక్స్ తనకు తెలుసని, గట్టిగా స్పందిస్తానని విజయశాంతి వ్యాఖ్యానించారు. 

vijaya shanthi
TRS
Congress
  • Loading...

More Telugu News