raghuveera reddy: ముఖ్యమంత్రి సీట్లో బాలకృష్ణ కూర్చోవడానికి ఇదే కారణం కావచ్చు!: రఘువీరారెడ్డి

  • తండ్రి కుర్చీని బాబు లాక్కున్నారనే విషయం మనసులో ఉండొచ్చు
  • అందుకే ఆయన లేని సమయంలో సీఎం కుర్చీలో కూర్చున్నారు
  • మోజు తీర్చుకున్నారు

సీఎం క్యాంప్ కార్యాలయంలోని చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్నారనే వార్త సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కుర్చీని చంద్రబాబు లాక్కున్నారనే విషయం బాలకృష్ణ మనసులో ఉండి ఉంటుందని... అందుకే చంద్రబాబు రాష్ట్రంలో లేనప్పుడు ఆయన కుర్చీలో కూర్చున్నారని... ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఆ మోజు తీర్చుకున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గవర్నర్ నరసింహన్ గౌరవించడం లేదని... ఇద్దరు ముఖ్యమంత్రులను పొగడటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

raghuveera reddy
Balakrishna
Chandrababu
narasimhan
  • Loading...

More Telugu News