Padmaavat: నిన్న స్కూల్ బస్సుపై దాడి చేసి.. చిన్నారులను భయాందోళనలకు గురిచేసిన ఘటనలో 18 మంది అరెస్ట్!

  • పద్మావత్ సినిమాపై ఆందోళనల నేపథ్యంలో ఘటన
  • గుర్గావ్‌లో నిన్న జీడీ గోయెంకా స్కూల్‌ బస్సుపై దాడి 
  • ఆ దాడితో తమకు సంబంధం లేదంటోన్న కర్ణిసేన 

దేశ రాజ‌ధాని ఢిల్లీకి ద‌గ్గ‌ర‌లోని గుర్గావ్‌లో నిన్న జీడీ గోయెంకా స్కూల్‌ బస్సులో చిన్నారులకు ఎదురైన భ‌యాన‌క అనుభ‌వానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమా పద్మావత్ సినిమా విడుదల అవ్వడానికి వీల్లేదంటూ రాజ్‌పుత్ కర్ణిసేనలు రహదారిపై వెళుతోన్న స్కూల్ బస్సు అద్దాలు పగులకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ కేసులో 18 మంది నిందితులని గుర్తించిన పోలీసులు ఈ రోజు వారిని అరెస్ట్ చేశారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరు పరచనున్నారు. అయితే, స్కూల్ బస్సుపై దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్‌పుత్ కర్ణిసేన చెబుతోంది. తాము చేస్తోన్న శాంతియుత ఆందోళనను బలహీన పరచాలన్న కుట్రతో కొందరు రాజకీయ నేతలు ఇటువంటి ప్లాన్ వేశారని అంటున్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News