dk aruna: రాహుల్ గాంధీతో భేటీ అయిన డీకే అరుణ

  • అరుణ, నంది ఎల్లయ్య , దామోదర్ రెడ్డిల భేటీ
  • పార్టీ అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన నేతలు
  • తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ భరోసా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాజీ మంత్రి డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదరర్ రెడ్డిలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన క్రమంలో ఆయనకు అభినందనలు తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీకి గట్టి పోటీ ఇచ్చారని ఆయనను అభినందించారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని రాహుల్ కు తెలిపారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ ను అభినందించేందుకు వచ్చామని చెప్పారు. గుజరాత్ లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటపటిమను కనబరిచిందో... అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా సత్తా చాటి అధికారంలోకి వస్తామని తెలిపారు. 

dk aruna
Rahul Gandhi
nandi yellaiah
  • Loading...

More Telugu News