Padmaavat: 'పద్మావత్' చిత్రంపై నిరసనల నేపథ్యంలో కర్ణిసేనకు నెటిజన్ల ఉద్బోధలు
- అనవసరంగా నిరసనలు తెలిపి రాజ్‌పుత్‌ల పరువు తీస్తున్నారని కామెంట్లు
- సినిమా చూడాలంటే కర్ణి సేన భయపెడుతున్నారంటూ వ్యాఖ్యలు
- ట్విట్టర్‌లో నవ్వులు పూయిస్తున్న జోకులు
'పద్మావత్' సినిమాపై నిరసనగా ఓ వైపు కర్ణిసేన బస్సులు తగలబెట్టడం, థియేటర్లు ధ్వంసం చేయడం వంటి పనులు చేస్తుంటే.. మరో వైపు నెటిజన్లు ఈ ఘటనలపై సోషల్ మీడియాలో జోకుల పర్వం కొనసాగిస్తున్నారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవని, రాజ్‌పుత్‌లు అనవసరంగా నిరసనలు చేస్తున్నారని వారు కామెంట్లు చేస్తున్నారు. సినిమా చూడాలనుకుంటున్న వారిని కర్ణిసేన భయపెడుతోందని వారు అంటున్నారు. ఆ కామెంట్లలో కొన్ని...
- 'పద్మావత్' సినిమా క్లైమాక్స్ చూస్తున్న వారందరూ థియేటర్ నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు!
- డియర్ కర్ణిసేన.. పీవీఆర్ థియేటర్‌లో మా ఆవిడ సినిమా చూస్తుంది... దయచేసి అక్కడికి వెళ్లండి!
- కర్ణిసేన వాళ్లు పద్మావతి రాణి గురించి ఓ డాక్యుమెంటరీ తీసి విడుదల చేయాల్సింది. ఆ డాక్యుమెంటరీ 'పద్మావత్' ఇంటర్వెల్ సమయంలో వేస్తే అటు చరిత్ర పాఠం, ఇటు సంజయ్ పాఠం రెండూ అర్థమయ్యేవి.
- సినిమాలో యుద్ధ సన్నివేశం, థియేటర్ బయట యుద్ధ సన్నివేశం ఒకేలా ఉన్నాయి.
- 'పద్మావత్' ఒకవేళ అమెరికాలో విడుదలై ఉంటే.. కర్ణిసేన వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తారా ఏంటి?