activist devi: రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవి

  • టీవీ షోలో వర్మ, దేవిల మధ్య మాటల యుద్ధం
  • దేవిపై వర్మ అనుచిత వ్యాఖ్యలు
  • సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదు చేశారు. తన గురించి టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె కోరారు. వర్మ రూపొందించిన 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' చిత్రానికి సంబంధించి ఆయనకు, దేవికి ఓ టీవీ ఛానెల్ లో వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇదొక బూతు సినిమా అని, పరమ చెత్త సినిమా అని...  ఇలాంటి సినిమాలు సమాజాన్ని చెడగొడతాయని దేవి అన్నారు. దీంతో, దేవిపై వర్మ కూడా అదే స్థాయిలో కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వర్మపై ఆమె ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ చిత్రం రేపు ఆం లైన్ మాధ్యమంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

activist devi
ram gopal varma
god S*x and truth
  • Loading...

More Telugu News