Padmavat: దీపిక చేసిన నృత్యం మనకు వద్దు: ఉదయ్ పూర్ లో 'ఘూమర్' సాంగ్ పై బ్యాన్!

  • తీవ్ర నిరసనల ఫలితంగా కలెక్టర్ కీలక నిర్ణయం
  • రిపబ్లిక్ డే వేడుకల్లో 'ఘూమర్' పాట వద్దని ఆదేశాలు
  • 'పద్మావత్' చిత్రంలో నర్తించిన దీపిక

రాజ్ పుత్ కర్ణిసేన చేస్తున్న నిరసనల ఫలితమో లేక వివాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఆందోళనో... ఉదయ్ పూర్ పాఠశాలలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో రాజస్థాన్ సంప్రదాయ నృత్యమైన 'ఘూమర్'ను ప్రదర్శించ వద్దన్న ఆదేశాలు వెలువడ్డాయి.

ఉదయ్ పూర్ అదనపు కలెక్టర్ ఎస్ సీ శర్మ పేరిట ఈ ఆదేశాలు వెలువడ్డాయి. 'పద్మావత్' చిత్రంలో 'ఘూమర్ ఘూమర్' పాటకు దీపికా పదుకొనే నృత్యం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్ లోని రాట్లాంలో కర్ణిసేన కార్యకర్తలు 'ఘూమర్' పాటకు నృత్యం చేస్తున్న పాఠశాల విద్యార్థులపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో సైతం 'ఘూమర్' పాటను బ్యాన్ చేస్తూ నిషేధాలు వెలువడగా, వాటిని జారీ చేసిన అధికారులకు పై స్థాయి నుంచి అక్షింతలు పడటం గమనార్హం.

Padmavat
Deepika Padukone
Ghoomer song
  • Error fetching data: Network response was not ok

More Telugu News