USA: ఎవ్వరూ బాధపడవద్దు... నేనున్నాను: ఇండియన్ ఇమిగ్రెంట్స్ కు ట్రంప్ మెసేజ్

  • మైనర్లుగా వెళ్లి అమెరికాలో ఉంటున్న 6.90 లక్షల మంది
  • అత్యధికులు భారత ఉపఖండం వారే
  • పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది
  • ఊరట కలిగించే వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికాలో దీర్ఘకాలంగా ఉంటూ పౌర సత్వానికి ఎదురు చూస్తున్న భారతీయులకు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు వలస వచ్చి శ్రమిస్తున్న భారతీయులు బాధపడాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. వారికి తగిన ప్రోత్సాహకం అందుతుందన్నారు. స్విట్జర్లాండ్ బయలుదేరడానికి కొన్ని గంటల ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, "ఎవ్వరూ బాధపడవద్దని వారికి చెప్పండి" అని ఎన్నారై ఇమిగ్రెంట్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కాగా, అమెరికాకు మైనర్లుగా వచ్చి స్థిరపడిన సుమారు 6.90 లక్షల మంది అన్ డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్, తమ పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. వీరిలో భారత ఉపఖండం నుంచి వెళ్లిన వాళ్లే అత్యధికులు. ఇక, మెక్సికో సరిహద్దుల్లో గోడను కట్టి తీరుతామని, ఈ పని పూర్తయ్యేందుకు 10 నుంచి 12 సంవత్సరాల సమయం పట్టవచ్చని ట్రంప్ అంచనా వేశారు.

USA
Donald Trump
Immigrents
NRIs
  • Loading...

More Telugu News