charan: 'రంగస్థలం' టీమ్ జోరు మీద ఉందంటోన్న చరణ్

  • 'రంగస్థలం' టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ 
  • టీమ్ లో కొత్త ఉత్సాహం 
  • మార్చి 30వ తేదీన సినిమా రిలీజ్

మెగా అభిమానులంతా 'రంగస్థలం' సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా నుంచి నిన్న రిలీజైన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న ప్రదేశానికి లోకల్ గా వున్న వాళ్లు వచ్చేసి, టీజర్ చాలా బాగుందని చెబుతున్నారట.

 ఇక చరణ్ బస చేసిన హోటల్ దగ్గరికి కూడా చాలామంది వచ్చేసి, టీజర్ సూపర్బ్ గా ఉందంటూ అభినందనలు తెలుపుతున్నారట. దాంతో ఈ సినిమా టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారనీ, మరింత ఎనర్జీతో పనిచేస్తున్నారని చరణ్ చెప్పాడు. టీజర్ కి దక్కుతోన్న ప్రశంసలు తమలో కొత్త శక్తిని .. ఉత్సాహాన్ని .. ఉత్తేజాన్ని నింపాయని చెప్పుకొచ్చాడు. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాను మార్చ్ 30వ తేదీన విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News