Swetha Nagu: రథసప్తమి అద్భుతం... భద్రాచలం సమీపంలో సూర్యుని చూస్తున్న శ్వేతనాగు... అటవీ అధికారులు తీసిన చిత్రమిది!

  • అడవిలోకి పులులను లెక్కించేందుకు వెళ్లిన అధికారులు
  • పడగవిప్పి సూర్యుని వైపు చూస్తున్న అరుదైన శ్వేతనాగు
  • సెల్ ఫోన్లలో బంధించిన అధికారులు

నిన్న దేశవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగగా, భద్రాచలం సమీపంలోని ఏజన్సీ ప్రాంతంలో పులులను లెక్కించేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు ఓ అద్భుతం కనిపించింది. సూర్యోదయం సమయంలో అరుదుగా కనిపించే శ్వేతనాగు, పడగవిప్పి, రెండడుగుల పైకి లేచి, సూర్యుని వైపు చూస్తూ నిలబడి కనిపించిందట.

అధికారుల అలికిడి విన్నప్పటికీ, కదలకుండా అలాగే నిలబడిందట. వెంటనే అధికారులు తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాన్ని బంధించారు. కాసేపటి తరువాత ఆ శ్వేతనాగు పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయిందట. రథసప్తమి రోజున ఇలా శ్వేతనాగు, సూర్య నమస్కారం చేస్తూ కనిపించడం విశేషమని చెబుతూ, ఆ ఫోటోలను అధికారులు విడుదల చేశారు. దాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News