Padmavat: పక్క వీధిలో కర్ణిసేన నేత విధ్వంసం సృష్టిస్తుంటే.. ఇటుపక్క అతని కారును తగలెట్టేశారు!

  • భోపాల్ లోని జ్యోతి టాకీస్ వద్ద ఘటన
  • కారు నిలిపి, పక్క వీధిలోకి వెళ్లిన కర్ణిసేన నేత
  • అతని కారును దగ్ధం చేసిన మరో గ్రూప్

'పద్మావత్' చిత్రానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలతో విరుచుకుపడుతున్న రాజ్ పుత్ కర్ణిసేన విధ్వంసానికి సొంత గ్రూప్ నేత బాధితుడయ్యాడు. భోపాల్ లోని జ్యోతి టాకీస్ వద్ద చిత్రం ప్రదర్శిస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొందరు కర్ణిసేన కార్యకర్తలు, అక్కడున్న వాహనాలకు నిప్పుపెడుతూ, 'ఎంపీ 04 హెచ్‌సీ 9653' నంబర్ గల స్విఫ్ట్ కారును దగ్ధం చేశారు.

ఆపై కారు ఎవరిదో తెలుసుకుని నాలిక కరచుకున్నారు. ఈ కారు ఆ పక్కనే ఉండే కర్ణిసేన నేత సురేంద్ర సింగ్ ది. ఆయన తన బ్యాచ్ నిరసనకారులతో కలసి, కారును అక్కడ నిలిపి, పక్క వీధిలో విధ్వంసం చేపట్టేందుకు వెళ్లాడట. అంతే... ఈలోగా ఇటు నుంచి వచ్చిన మరో గ్రూప్ అతని కారును నాశనం చేసింది. కారుపై కర్ణిసేన అన్న స్టిక్కర్ కూడా ఉందని, దాన్ని గమనించకుండా తన వాహనాన్ని దగ్ధం చేశారని ఇప్పుడు వాపోతున్నాడు సురేంద్ర సింగ్. 'చెరపకురా చెడేవు' అంటే ఇది కాక ఇంకేంటి?

Padmavat
Karnisena
Bhopal
  • Loading...

More Telugu News