nagarjuna: వర్మ సినిమాలో నాగ్ తరువాత ముఖ్యమైన పాత్ర అదేనట!

  • వర్మ దర్శకత్వంలో నాగ్ 
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజయ్ 
  • త్వరలోనే టైటిల్ ప్రకటన  

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. 'శివ'.. 'అంతం' .. 'గోవిందా గోవిందా' తరువాత ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. నవంబర్ 20వ తేదీన హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో మొదలైన ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది.

మేజర్ షెడ్యూల్ ను ముంబైలో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నాగ్ సరసన మైరా సరీన్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆయనతో పాటు అజయ్ కూడా ఓ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. నాగార్జున తరువాత ఈ సినిమాలో అజయ్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత వుంటుందట. ఈ సినిమాతో అజయ్ మరింత బిజీ కావడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు

nagarjuna
myra
ajay
  • Loading...

More Telugu News