awards: ‘పద్మ’ అవార్డుల ప్రకటన నేడు!

  • గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా 'పద్మ విభూషణ్‌', 'పద్మ భూషణ్‌', 'పద్మ శ్రీ' అవార్డులు
  • నేడే ‘పద్మ’ పురస్కారాల విజేతల ప్రకటన
  • ఈ ఏట 15,700 దరఖాస్తులు

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ పురస్కారాలకు ఎంపిక చేసిన వారి జాబితాను నేడు కేంద్రప్రభుత్వం ప్రకటించనుంది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సమాజ సేవ, విజ్ఞానశాస్త్రం, వాణిజ్యం, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఎనలేని కృషి చేసిన వారికి ప్రతి ఏటా 'పద్మ విభూషణ్‌', 'పద్మ భూషణ్‌', 'పద్మశ్రీ' అవార్డులను ప్రభుత్వం ప్రకటిస్తుంటుందన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ఏడాది ఈ పురస్కారాలకు 15,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వశాఖలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలు, గతంలో భారత రత్న, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీతలు ఈ అవార్డుల కోసం పేర్లను ప్రతిపాదిస్తారు. ఇలా ప్రతిపాదనకు వచ్చిన పేర్లను పరిశీలించిన పద్మ పురస్కారాల కమిటీ అవార్డు గ్రహీతలను నిర్ణయిస్తుంది. గతేడాది 89 మందికి పద్మ పురస్కారాలు దక్కగా, వారిలో ఏడుగురు 'పద్మ విభూషణ్‌', మరో ఏడుగురు 'పద్మ భూషణ్‌' అవార్డులు అందుకోవడం విశేషం. 

  • Loading...

More Telugu News