kcr: తెలంగాణలో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ తో సత్ఫలితాలు: మంత్రి నాయిని
- జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం
- తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ గా ఉంది
- రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ : నాయిని
తెలంగాణలో పోలీస్ శాఖ అనుసరిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం సత్ఫలితాలనిస్తోందని రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మించిన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు.
అనంతరం, నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ గా ఉందని ప్రశంసించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా కితాబిచ్చారు. అనంతరం, మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని అత్యంత భద్రతా నగరంగా తీర్చిదిద్దుతున్నామని, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రూ.30 కోట్లతో ముప్పై నాలుగు పోలీస్ స్టేషన్లు, ముప్పై ఏడు బ్యారెక్స్ ఆధునికీకరించామని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్లను రూ.12 కోట్లతో ఆధునికీకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.