puneeth raj kumar: కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని కలసిన విజయ్ దేవరకొండ!

  • రాక్ లైన్ వెంకటేశ్ తో విజయ్ దేవరకొండ 
  • ఇద్దరూ కలిసి పునీత్ రాజ్ కుమార్ ఇంటికి 
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ  

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ .. విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఈ ఇద్దరూ ఎక్కడ .. ఎందుకు కలిశారు? అనే సందేహం అందరిలోను తలెత్తుతోంది. నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ .. విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఈ ఇద్దరూ బెంగుళూర్ లో కలుసుకున్నారు.

 ఆ తరువాత ఇద్దరూ కూడా పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారట. 'సూపర్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండను కలుసుకున్నాను' అని పునీత్ రాజ్ కుమార్ స్పందిస్తే, 'పునీత్ అన్నను కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా వుంది' అంటూ విజయ్ దేవరకొండ స్పందించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన నటిస్తోంది. 

puneeth raj kumar
vijay devarakonda
  • Loading...

More Telugu News