Sofali: నిన్న ఇంత అందం, నేడు ధవళ వస్త్రాలతో సన్యాసినిగా ఇలా... దీక్ష తీసుకునే ముందు గుజరాతీ యువతి ఫోటో షూట్!
- వసంత పంచమి నాడు జైన దీక్ష తీసుకున్న సోఫాలీ
- అంతకుముందు సంప్రదాయ వస్త్రాలతో ఫోటో సెషన్
- నెట్టింట వైరల్ అవుతున్న చిత్రాలు
సోఫాలీ... గుజరాత్ లోని వడోదర పరిధిలోని నిజామ్ పురాకు చెందిన యువతి. చదువులో ఎంతో ముందుండే ఆమె, సైన్స్ ఫ్యాకల్టీలో ఫ్యామిలీ అండ్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్. వసంత పంచమి సందర్భంగా నిజాంపురా జైన సంఘం ఆధ్వర్యంలో అత్యంత క్లిష్టమైన జైన దీక్ష తీసుకుంది. వందలాది మంది జైనులు హాజరు కాగా, ఆమె దీక్షను స్వీకరించింది.
అంతకుముందు ఆమె, సంప్రదాయ వస్త్రాలు ధరించి, చివరి సారిగా మేకప్ తో ఓ ఫోటో సెషన్ చేయించుకుంది. ఆపై తలనీలాలు తీసేసి, తెల్ల బట్టలు కట్టుకుని సన్యాసినిలా మారిపోయి దీక్ష చేపట్టింది. సోఫాలీ తండ్రి ఐదేళ్ల క్రితమే మరణించగా, అప్పటి నుంచి ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆమె, ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి కుటుంబీకులంతా మద్దతు పలికారు. ఇక సోఫాలీ ఫొటో షూట్ చిత్రాలు, ఆపై సన్యాసినిగా మారిన తరువాత తీసిన చిత్రాన్ని మీరూ చూడవచ్చు.