goair: గో ఎయిర్ రిపబ్లిక్ డే ఆఫర్... రూ.726కే విమానయానం!

  • ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో కొన్ని సీట్లకే
  • నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆఫర్లు
  • మార్చి-డిసెంబర్ మధ్య ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కంపెనీలు భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లకు తెరదీస్తున్నాయి. గోఎయిర్ విమానయాన సంస్థ కేవలం రూ.726కే విమాన ప్రయాణ టికెట్ ను రిపబ్లిక్ డే ఆఫర్ కింద అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు ఆఫర్ పీరియడ్ అమల్లో ఉంటుంది. మార్చి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

అన్ని చార్జీలతో కలిపి వివిధ మార్గాల్లో రూ.726 నుంచి రూ.3,926 మధ్య ధరలపై టికెట్లను అందిస్తోంది. గో ఎయిర్ యాప్, గో ఎయిర్ డాట్ ఇన్ ద్వారా బుక్ చేసుకుంటే అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. అన్ని మార్గాల్లో కాకుండా ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో పరిమిత సీట్లకే ఈ ధరలు వర్తిస్తాయి. ప్రయాణం రద్దయితే టికెట్లపై రూపాయి కూడా వాపసు రాదు. ఇప్పటికే స్పైస్ జెట్, ఇండిగో కూడా రిపబ్లిక్ డే ఆఫర్లను ప్రకటించాయి.

goair
republic day
offer
airlines
  • Loading...

More Telugu News