Agnatavaasi: టీ-సీరీస్ కు గానీ, త్రివిక్రమ్ కు గానీ ఆ హక్కే లేదు: 'అజ్ఞాతవాసి' కాపీపై జెరోమ్ సాలీ కీలక వ్యాఖ్యలు

  • మరోసారి మండిపడ్డ జెరోమ్ సాలీ
  • టీ-సిరీస్ వద్ద కేవలం హిందీ రీమేక్ హక్కులు మాత్రమే
  • 'సిల్వర్ స్క్రీన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెరోమ్

పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'పై ఫ్రెంచ్ చిత్రం 'లార్గోవించ్' దర్శకుడు జరోమ్ సాలీ మరోసారి మండిపడ్డారు. తన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే హక్కులు త్రివిక్రమ్ కుగానీ, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ కు గానీ, టీ-సిరీస్ కు గానీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసుకునే హక్కులు మాత్రమే టీ-సిరీస్ వద్ద ఉన్నాయని, 'సిల్వర్ స్క్రీన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.

తాను ఈ చిత్రాన్ని చూశానని, ఆ సమయంలో థియేటర్ లో ఉన్న ఒకే ఒక్క ఫ్రెంచ్ వ్యక్తిని తానేనని, సినిమా కథతో సహా ఎన్నో సీన్లు, నటీనటుల నటన, లొకేషన్లు ఒకేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ సినిమా తీసిన నిర్మాతలతో భారత్ కు చెందిన టీ-సిరీస్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, వారికి తెలుగు రీమేక్ తో ఎటువంటి సంబంధమూ లేదని, హిందీ రీమేక్ కు మాత్రమే వారివద్ద అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు.

Agnatavaasi
Jerome Salle
T-Series
  • Error fetching data: Network response was not ok

More Telugu News