laluprasad yadav: దాణా స్కామ్ లో మూడో కేసులోనూ లాలూను దోషిగా ప్రకటించిన కోర్టు

  • రాంచిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం
  • ఇప్పటికే మరో రెండు కేసుల్లో లాలూకు శిక్షలు
  • జగన్నాథ్ మిశ్రానూ దోషిగా ప్రకటించిన కోర్టు

మరో దాణా స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా రాంచిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు ప్రకటించింది. లాలూ దాణా స్కామ్ కు సంబంధించి దోషిగా తేలిన మూడో కేసు ఇది. మరో రెండు కేసుల్లోనూ ఆయన ఇప్పటికే దోషిగా నిరూపితం అవడమే కాకుండా, కోర్టు శిక్షలు ఖరారు చేసింది.

బిహార్ రాష్ట్రంలో1990 తర్వాత చోటు చేసుకున్న దాణా స్కామ్ పై పలు కేసులను సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. 1992-93లో చై బాసా ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.33.67 కోట్లను డ్రా చేసినందుకు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. దీనిపై ఎగువ కోర్టులో సవాలు చేయనున్నట్టు ఆర్జేడీ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం లాలూ రాంచిలోని బిస్రాముండా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

laluprasad yadav
dana scam
  • Loading...

More Telugu News