kona venkat: నేనే అన్నీ అనుకుంటే కష్టమే: కోన వెంకట్
- సినిమా అనేది టీమ్ వర్క్
- టీమ్ వర్క్ తోనే సక్సెస్ సాధ్యం
- 'నేను లేకపోతే..' అనుకోవడం అమాయకత్వం
తెలుగు సినిమా కథను మరింత వినోదభరితంగా పరుగులు తీయించిన రచయితగా కోన వెంకట్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన కలం నుంచి వెలువడిన ఎన్నో కథలు .. విజయవంతమైన చిత్రాలను అందించాయి. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంలోనే ఆయన టీమ్ వర్క్ ను గురించి ప్రస్తావించారు.
" నేను .. శ్రీను వైట్ల .. గోపీ మోహన్ ఒక టీమ్ గా ఉండేవాళ్లం. కొన్ని కారణాల వలన ఈ టీమ్ బ్రేక్ అయింది. టీమ్ లో ఒక్కొక్కరి ఐడియా ఒక్కోసారి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం వుంది. అంతేగానీ నేను లేకపోవడం వలన ఫలానా సినిమా దెబ్బతిందని అనుకోవడం అమాయకత్వం అవుతుంది. టీమ్ బాగుంటే మంచి అవుట్ ఫుట్ వస్తుంది .. లేదంటే ఆ ప్రభావం అవుట్ ఫుట్ మీద తప్పకుండా పడుతుంది" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.