mada krishna madiga: కేసీఆర్, కేటీఆర్ లను ఎందుకు అరెస్ట్ చేయలేదు?: మందకృష్ణ

  • చట్టం కొందరికే వర్తిస్తుందా?
  • గతంలో దీక్ష చేసిన కేసీఆర్ ను ఎందుకు జైల్లో పెట్టలేదు?
  • గవర్నర్ ను కలిసి ఇదే విషయం అడుగుతా

చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గవర్నర్ నరసింహన్ ను కలిసి ఇదే విషయాన్ని అడుగుతానని ఆయన అన్నారు. చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలని కోరుతానని చెప్పారు. గతంలో 10 రోజులు దీక్ష చేసిన కేసీఆర్ ను ఎందుకు జైల్లో పెట్టలేదని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై 307 కేసులు నమోదయ్యాయని... కానీ, వారిని అరెస్ట్ చేయలేదని అన్నారు. చట్టం కేవలం కొందరికే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. నియంతలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.   

mada krishna madiga
KCR
KTR
Harish Rao
narasimhan
  • Loading...

More Telugu News