Pawan Kalyan: నాడు అలా, నేడు ఇలా... శ్రీజను చూసి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న పవన్ కల్యాణ్!

- 2012లో నరాల వ్యాధితో బాధపడిన శ్రీజ
- స్వయంగా వెళ్లి పరామర్శించిన పవన్ కల్యాణ్
- నేడు కొత్తగూడెంలో పవన్ ను కలుసుకున్న శ్రీజ
శ్రీజ... భయంకరమైన నరాల వ్యాధితో బాధపడుతూ ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ, తాను పవన్ కల్యాణ్ ను చూడాలని ఉందని కోరగా, స్పందించిన పవన్, స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆమెను పలకరించాడు. 2014 అక్టోబర్ లో ఈ ఘటన జరిగింది. శ్రీజ కోరికను 'మేక్ ఏ విష్ ఫౌండేషన్' పవన్ కు విన్నవించి, ఆమె కోరికను తీర్చింది. కోమాలోకి వెళ్లి చావు అంచులను చూసిన శ్రీజ తిరిగి కోలుకుంది.
ఆ విషయం పవర్ స్టార్ కూ తెలుసు. ప్రస్తుతం 'చలోరే చల్' పేరిట యాత్రలో భాగంగా ప్రస్తుతం కొత్తగూడెంలో వున్నా పవన్ ను, పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్న శ్రీజ కలుసుకుంది.
