Pawan Kalyan: పవన్ చేసిన ఆ వ్యాఖ్యలు కత్తి మహేష్ గురించేనా?

  • సమస్యలన్నీ వదిలేసి నన్ను లక్ష్యంగా చేసుకున్నారు
  • వారందరినీ ఎదుర్కొంటాను
  • కార్యకర్తలు మాత్రం స్పందించవద్దు
  • పవన్ వ్యాఖ్యలు కత్తి గురించేనని అభిమానుల్లో చర్చ

ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తూ, జనసేన పార్టీని బలోపేతం చేస్తున్న పవన్, ఇటీవలి కాలంలో తనను విమర్శిస్తూ వచ్చిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పేరును ప్రస్తావించకుండా మాట్లాడారని పీకే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కరీంనగర్ లో అభిమానులతో మాట్లాడిన పవన్, ఇండియాలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ వదిలేసి కొందరు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

తాను చాలా మొండివాడినని, వారందరినీ ఎదుర్కొంటానని, పిరికివాడిగా పారిపోనని చెప్పారు. ఎవరు ఏమన్నా భరించే శక్తి తనకుందని వెల్లడించిన ఆయన, కార్యకర్తలు మాత్రం ఎక్కువగా స్పందించ వద్దని, తనకన్నీ తెలుసునని, తాను చూసుకుంటానని అన్నారు. ఇక పవన్ ఈ వ్యాఖ్యలు కత్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని సామాజిక మాధ్యమాల్లో ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Pawan Kalyan
Kathi Mahesh
Chalore Chal
  • Loading...

More Telugu News