Guntur District: గుంటూరు జిల్లాలో వైఎస్ విగ్రహం ధ్వంసం... పరిస్థితి ఉద్రిక్తం!

  • దాచేపల్లి మండలంలో ఘటన
  • నిరసనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు
  • పోలీసు పికెటింగ్ ఏర్పాటు

గుంటూరు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాచేపల్లి మండలం కేసానుపల్లిలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగి, రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేసానుపల్లిలో 144 సెక్షన్ విధించామని తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేశామని, వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

Guntur District
Dachepalli
YSR Statue
Un Identified Persons
  • Loading...

More Telugu News