ACB ASP: అనుమతి లేకుండా నగరాన్ని వీడొద్దు... నీతి తప్పిన ఏఎస్పీ సునీతా రెడ్డికి ఆదేశం!
- కల్వకుర్తి సీఐతో ఏసీబీ ఏఎస్పీ సునీత వివాహేతర సంబంధం
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సునీత భర్త
- ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు
- సునీతపై ఆంక్షలు విధించిన అధికారులు
కట్టుకున్న భర్తను మోసం చేస్తూ, ఓ సీఐతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డిని సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు, ఆమెపై పలు ఆంక్షలను విధించారు. మూడు రోజుల క్రితం అర్థరాత్రి తన భార్య సునీతతో ఉన్న కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సురేందర్ రెడ్డి, వారిద్దరి వ్యవహారాన్ని వీడియో సాక్ష్యాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఇద్దరూ ప్రవర్తించారని భావించిన అధికారులు, వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా పేరిట జారీ అయిన ఈ ఉత్తర్వుల్లో, సస్పెన్షన్ అమలులో ఉన్నంత కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ నగరాన్ని వీడవద్దని సునీతను ఆదేశించారు. సీఐపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ లో ఆమె పేరుండటం, ఆమె అనైతికంగా ప్రవర్తించిందన్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.