Harish Rao: తెలియని నంబర్... కాల్ ఎత్తగానే 'హలో.. నేను మీ ప్రియమైన హరీశ్‌ రావును' అంటూ మాటలు!

  • సిద్ధిపేట వాసులకు హరీశ్ రావు ఫోన్
  • స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కల్పించాలని నిర్ణయం
  • పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వినతి
  • వినూత్న మార్గాన్ని ఎంచుకున్న మంత్రి

హైదరాబాద్ కోడ్ '040'తో తెలియని ఓ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. దాన్ని ఎత్తగానే... "నమస్కారం. నేను మీ ప్రియమైన హరీశ్‌ రావును మాట్లాడుతున్నాను" అన్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు గొంతు వినిపిస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ఆయన ఇటువంటి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఇటువంటి కాల్స్ రావడం, దాన్ని లిఫ్ట్ చేసి తమ ప్రియనేత హరీశ్ రావు గొంతు వినడం సిద్ధిపేట వాసులకు అనుభవమే.

ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో సిద్ధిపేట కూడా ఉందని, పట్టణంలో ఇప్పటికే బహిరంగ మలమూత్ర విసర్జన లేదని గుర్తు చేస్తున్న హరీశ్, ఇంటింటికీ చెత్త సేకరణను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. దేశంలోనే తొలి స్థానాన్ని పొందేలా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదో మహాయజ్ఞమని, దీనిలో భాగస్వామ్యులయ్యేందుకు '1969'కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతూ తన సందేశాన్ని ముగిస్తుండగా, పట్టణంలో ఇదిప్పుడు హాట్ టాపిక్.

Harish Rao
Telangana
Siddipeta
Swatcha Sarvekshan
ODF
  • Loading...

More Telugu News