Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తమన్నాకు ఆ కోరిక పదేళ్ల తర్వాత తీరిందట!
  • ఆగస్టు నుంచి 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ 
  • వాయిదా పడిన సాయిపల్లవి 'కణం'
  • అదే బ్యానర్లో నితిన్ మరో సినిమా

*  'హీరో విక్రం నుంచి ఏంతో నేర్చుకున్నాను..' అంటోంది మిల్కీ వైట్ భామ తమన్నా. తాజాగా విక్రంతో కలసి తమన్నా 'స్కెచ్' అనే సినిమా చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "పరిశ్రమకు వచ్చినప్పటి నుంచీ విక్రంతో నటించాలని అనుకుంటున్నాను. పదేళ్లకి ఈ సినిమా ద్వారా అది కుదిరింది. అందుకే ఈ సినిమా నాకు స్పెషల్. ఆయన నుంచి ఏంతో నేర్చుకున్నాను" అని చెప్పింది.
*  మహానటుడు దివంగత ఎన్టీ రామారావు జీవితంపై తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి జరుగుతుంది. ఈ లోగా వెంకటేష్ తో ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాన్ని తేజ పూర్తి చేస్తాడు.
*  నాగశౌర్య, సాయిపల్లవి జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'కణం' చిత్రం విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 9న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని అదే నెల 23న రిలీజ్ చేస్తారు. ఏఎల్ విజయ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  ఇటీవల నితిన్ హీరోగా 14 రీల్స్ సంస్థ నిర్మించిన 'లై' చిత్రం పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ అదే సంస్థకు నితిన్ మరో చిత్రాన్ని చేస్తున్నాడు. ఓ యువ దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తాడు.   

  • Loading...

More Telugu News