Andhra Pradesh: రైతులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లక్ష్యం: ఏపీ సీఎస్ దినేష్ కుమార్

  • సచివాలయంలో ఎస్ఎల్ఇసి  సమావేశం 
  • 22 యూనిట్లకు సీఎస్ అనుమతులు మంజూరు
  • ప్రభుత్వమిచ్చే రాయితీలు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు  
  • ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

ఉద్యోగాల కల్పనతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర చెల్లించి, రైతులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల లక్ష్యమని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన స్టేట్ లెవెల్ ఎంపవర్డ్ కమిటీ (ఎస్ఎల్ఇసి) సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

 స్థానిక వ్యవసాయోత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ కు అధికారులు తెలిపారు. 22 యూనిట్లకు సీఎస్ అనుమతులు మంజూరు చేశారు. యూనిట్లు ఏయే ప్రాంతాల్లో, ఎన్ని కోట్ల రూపాయలతో ఆయా యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారనే వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు సీఎస్ కు వివరించారు.  

ఈ సందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, స్వప్రయోజనాల కోసం ప్రభుత్వమిచ్చే రాయితీలు దుర్వినియోగం చేసే ఆయా కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఆయా కంపెనీ యాజమాన్యాల పూర్వ పనితీరు, విశ్వసనీయతతో పాటు స్థానిక వ్యవసాయోత్పత్తుల దిగుబడులను పరిగణనలోకి తీసుకుని కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యేలా చూడాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్న కంపెనీలకు బ్యాంకులు ఇస్తున్న రుణాలు, వడ్డీల వివరాలు స్వయంగా తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఉద్యోగాల కల్పనతో పాటు వ్యవసాయోత్పత్తులకు మంచి ధర లభించి, రైతులకు ఆర్థిక లబ్ధి కలగజేసేందుకే రాష్ట్రంలో విరివిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం శీఘ్రగతిన అనుమతులిస్తోందని అన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతులిచ్చాం? వాటిలో ఎన్ని ఏర్పాటయ్యాయి? వాటి వల్ల ఎన్ని ఉద్యోగాలు లభించాయి? అనే వివరాలు వచ్చే సమావేశంలో అందించాలని అధికారులను ఈ సందర్భంగా దినేష్ కుమార్ ఆదేశించారు.  

  • Loading...

More Telugu News